Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: హీరో సూర్యకు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. దాదాపు రూ.3 కోట్లు చెల్లించాలని ఆదాయ పన్ను శాఖ ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ సూర్య వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. వివారాల్లోకి వెళితే.. సూర్య తన ఆదాయానికి తగ్గట్టు పన్నులు చెల్లించం లేదనే కారణంతో 2010లో ఆదాయ పన్ను శాఖ అధికారులు ఏక కాలంలో ఆయనకు సంబంధించిన ఇళ్లు, వ్యాపార స్థలాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో లెక్కల్లో లేని పలు ఆదాయాలకు సంబంధించి మొత్తం రూ. 3.11 కోట్లు చెల్లించాలని నోటీసులు జారీ చేశారు. ఆదాయపు పన్ను అధికారులు జారీ చేసిన నోటీసులో వడ్డీ మినహాయించాలని కోరుతూ సూర్య మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మాత్రం సెలబ్రిటీగా ఉన్నత స్థానంలో ఉన్న మీలాంటి వ్యక్తులు మిగతా వారికి ఆదర్శంగా ఉండాలని చెబుతూ..ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాల్సిందేనని తీర్పు ఇచ్చింది.