Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాలిబన్లు అఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించడంతో ఇప్పటికే ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా యూట్యూబ్, వాట్సాప్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నాయి. తాలిబన్లకు చెందిన వీడియోలను యూట్యూబ్‌లో కన్పించే ప్రసక్తే లేదని తెలిపారు. తాలిబన్లకు చెందిన వీడియోలను స్ట్రీమ్ చేయకుండా చేసే పాలసీ తాము ఎప్పటినుంచో అనుసరిస్తున్నామని యూట్యూబ్ తెలిపింది. వాట్సాప్ కూడా అఫ్ఘన్లు తాలిబన్లను కాంటాక్ట్ అయ్యే ఫిర్యాదుల హెల్ప్‌లైన్‌ను మూసివేసింది. అయితే దీనిపై మాట్లాడటానికి వాట్సాప్ ప్రతినిధి నిరాకరించారు.