Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యూపీలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లైంగిక వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని ఓ మహిళకు నిందితుడు నిప్పంటించాడు. ఈ ఘటన మహోబా జిల్లాలో కుల్పహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తత్వార గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో ఆగస్ట్ 14న ఓ మహిళ ఇంటి వద్ద ఒంటరిగా ఉండటం గమనించిన విపిన్ అనే వ్యక్తి ఆమెను లైంగికంగా వేధించాడు. దాంతోమహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ కక్షతో ఆమెను సజీవ దహనం చేసేందుకు నిందితుడు ప్రయిత్రించగా అతనికి అతని కుటుంబసభ్యుల సహకరించారు. దాంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి వారిని అరెస్ట్ చేశారు. బాధితురాలిని ఝాన్సీ మెడికల్ కాలేజ్‌కు తరలించారు.