Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పంజరంలోని చిలకలా మారిన సీబీఐకి భారత ఎన్నికల కమిషన్ మాదిరిగా స్వతంత్ర ప్రతిపత్తితో స్వేచ్ఛను ప్రసాదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు కోరింది. 300 కోట్ల పాన్జి స్కామ్ కేసు విచారణ సందర్భంగా జస్టిస ఎన్ కిరుబకరన్, జస్టిస్ పుగలేందితో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి వనరులు, సిబ్బంది పరిమితంగా ఉండటంతో విచారణ చేపట్టాల్సిన అవసరం తలెత్తినప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తును చేపట్టలేకపోతోందన్నారు. న్యాయస్ధానాల ఎదుట సీబీఐ తన లోటుపాట్లను ఏకరువు పెట్టడం సర్వసాధారణమైందని తెలిపింది. ఎన్నికల కమిషన్, కాగ్ తరహాలో సీబీఐకి విస్తృత అధికారాలు కల్పించేలా చట్టం తీసుకురావాలని సూచించారు. సీబీఐకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయింపులు చేపట్టాలని అన్నారు. డిప్యుటేషన్‌పై ఆధారపడకుండా సీబీఐ కోసం ప్రత్యేకంగా పనిచేసే అధికారులు ఉండాలని స్పష్టంచేశారు. నిధులు, సౌకర్యాల లేమి వంటి పలు అవరోధాలను అధిగమిస్తూ సీబీఐ పనిచేస్తోందని కోర్టు పేర్కొంది. సీబీఐకి కంప్ర్టోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండిమా మాదిరిగా అటనామీ ఉండాలని తెలిపింది.