Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాలిబాన్లను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చినట్టు చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్, మరో ఇద్దరిపై పోలీసులు ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ మేరకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ చార్ఖేష్ మిశ్రా ఒక ప్రకటనలో తెలిపారు. తాలిబాన్లను భారత స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చారని, వారి విజయాన్ని సంబరంగా జరుపుకున్నారని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భారత ప్రభుత్వం ప్రకారం తాలిబాన్ ఒక ఉగ్రవాద సంస్థ. అనితాలిబాన్లపై చేసిన వ్యాఖ్యలు రాజద్రోహంగా పరిగణించవచ్చని తెలిపారు. ఎంపీపై 124A, 153A, 295 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఎంపీతో పాటు ఫేస్ బుక్ లో ఓ వీడియో ఇలాంటి వ్యాఖ్యలే చేసిన ఫైజాన్ చౌదరి, మహమ్మద్ ముకీమ్ లపై కూడా కేసు నమోదు చేసినట్టు వివరించారు. స్థానిక బీజేపీ నాయకుడు వారిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది.
దీనిపై ఎంపీ షఫీఖర్ రహ్మాన్ బార్క్ స్పందిస్తూ తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. తాను భారతీయుడినని, అఫ్ఘనిస్తాన్ పౌరుడిని కానని, తనకు అక్కడ ఏం జరుగుతుందో సంబంధం లేదన్నారు. తాను తన ప్రభుత్వ విధానాలను అనుసరిస్తానన్నారు.