Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హోంశాఖమంత్రి మహమూద్అలీ, ఎక్సైజ్ శాఖమంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సంబంధిత అధికారులతో వారు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేయాలని, త్వరగా పరిష్కరించాలని, చట్ట పరంగా పకడ్బందిగా చర్యలు చేపట్టాలని పోలిసు అధికారులను ఆదేశించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని త్వరలో పట్టుకుంటామని పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో కమిషనర్ శీఖా గోయల్ , డీసీపీ కల్మేశ్వర్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తదితరులు పాల్గొన్నారు