Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నేరేడుచర్ల మండలం పత్తేపురంలో ఓ యువతిపై బాబాయి లైంగికదాడికి పాల్పడ్డాడు. దాంతోఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ యువతి తన తల్లిదండ్రులను కోల్పోగా సొంత బాబాయి చేరదీశాడు. అనంతరం ఆ యువతిపై లైంగిక దాడి చేశాడు. దాంతో యువతి గర్భం దాల్చింది. పెద్దనాన్న కొడుకు అంజి కూడా యువతిని వేదించడంతో మనస్తాపం చెందిన ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు.