Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నిర్ణీత కాల ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 8 పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆన్ లైన్ లో 25.08.2021లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత: కనీసం 60శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో ఏడాది అనుభవం ఉండాలి. అలాగే వయసు: 31.07.2021 నాటికి 30ఏండ్లు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని వర్చువల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు.
వేతనం: నెలకు రూ.23,000
వెబ్సైట్: www.ecil.co.in