Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా మహమ్మారి కట్టడికి ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తం 57.88 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. త్వరలో మార్గమధ్యలో ఉన్న మరో 18,62,530 డోసులు రాష్ట్రాలకు చేరుకోనున్నాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. వృథాగా పోయిన వాటితో కలిపి బుధవారం ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 55,11,64,635 వ్యాక్సిన్ డోసులను వినియోగించినట్టు ఆరోగ్యశాఖ చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల దగ్గర 94 లక్షల వ్యాక్సిన్ డోసులు నిలువ ఉన్నాయని తెలిపింది.