Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎంపీ బండి సంజయ్ తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంజయ్ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశ అత్యున్నత చట్టసభ సభ్యుడిగా ఉన్న సంజయ్ ఆ పదవిని అవమానిస్తున్నారన్నారు. పార్లమెంట్ గౌరవం గురించి తెలుసుకుని మాట్లాడాలన్నారు. ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని, ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.