Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐసీసీ తాజాగా టెస్ట్ ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన రెండో టెస్ట్‌లో 8 వికెట్లు తీసిన సిరాజ్.. 465 రేటింగ్ పాయింట్స్‌తో 18 స్థానాలు ఎగబాకి 38వ స్థానానికి చేరుకున్నాడు. మరోవైపు తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో అదరగొట్టిన కేఎల్ రాహుల్ 19 స్థానాలు మెరుగుపరుచుకుని 37వ ర్యాంక్‌కు ఎగబాకాడు. ఇక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తన ఐదో స్థానాన్ని నిలబెట్టుకోగా, రోహిత్ శర్మ ఆరో ర్యాంక్ లోనే కొనసాగుతున్నాడు. అయితే కోహ్లీకి 776 రేటింగ్ పాయింట్లు ఉండగా రోహిత్ కు 773 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. అంటే రోహిత్ కంటే కోహ్లి కేవలం మూడు రేటింగ్ పాయింట్లు మాత్రమే ఎక్కువగా ఉన్నాడు. అలాగే 736 పాయింట్లతో రిషబ్ పంత్ 7వ స్థానంలో కొనసాగుతున్నాడు. రెండో టెస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిసిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ 893 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానానికి దూసుకురాగా, కేన్ విలియమ్సన్(901) అగ్రస్థానంలో ఉన్నాడు. స్టీవ్ స్మిత్(891) మూడో స్థానానికి, మార్నస్ లబుషేన్(878) నాలుగో ప్లేస్‌కు దిగజారారు.
ఇక బౌలింగ్‌లో పాట్ కమిన్స్(908) అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్(848) రెండో ప్లేస్‌లో ఉన్నాడు. బుమ్రా ఒక ర్యాంక్ దిగజారి 10వ స్థానంలో నిలిచాడు. ఇక, ఆల్‌రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ మూడు, నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. విండీస్ ఆటగాడు జేసన్ హోల్డర్ టాప్‌లో కొనసాగుతున్నాడు.