Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తల్లి వివాహేతరం సంబంధం పెట్టుకుందని ఆమె కొడుకు, ఆమె తమ్ముడు కలిసి ఆమె గొంతు కోశారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో కోసం లక్ష్మి అనే మహిళకు ఒక కొడుకు, ఒక కూతురు. అయితే ఆమెను భర్త వదిలేయడంతో ఆమె తన కొడుకు రవి, కూతురు శిరిషా, తమ్ముడు ప్రవీణ్ తో కలిసి ఉంటుంది. అయితే లక్ష్మి కొంతకాలంగా మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుంది. దాంతో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుందని ఆమె కొడుకు, ఆమె తమ్ముడు అనుమానించారు. లక్ష్మిని హత్య చేసేందుకు పథకం పన్నారు. మంగళవారం తెల్లవారుజామున ఆమె నిద్రిస్తుండగా వారు కత్తితో గొంతు కోసి హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఆమె కేకలు వేయడంతో ఇద్దరూ పారిపోయారు. చుట్టుపక్కల వారు వచ్చి ఆమెను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మి కూతురు శీరిష ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.