Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణలో అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బందికి శుభవార్త. వారికి వేతనాలను పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 30 శాతం మేర పెంపు అమలు చేస్తూ మహిళా, శిశుసంక్షేమశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్ల వేతనం రూ. 10,500 నుంచి రూ. 13,650కి.. మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ. 6 వేల నుంచి 7800కు పెంచింది. అంగన్వాడీ కార్యకర్తల వేతనం రూ. 6 వేల నుంచి 7800కు పెంచింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు కానున్నాయని ప్రభుత్వం తెలిపింది.