Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పూజా హెగ్డె పై ప్రముఖ దర్శకుడు ఆర్కే సెల్వమణి ఆగ్రహం వ్యక్తం చేశాడు. సెట్లో ఆమె తీరుతో నిర్మాతలకు అధిక భారం అవుతోందని ఆరోపించాడు. ఇటీవల ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో షూటింగ్ సెట్‌కు పూజా ఒకరిద్దరిని మత్రమే తన వెంట తీసుకుని వచ్చేదన్నారు. కానీ ఇప్పుడు స్టార్డమ్ వచ్చాక తన వెంట 12 మందిని తీసుకుని వస్తుందన్నారు. అంతమందిని సెట్‌కు తీసుకువస్తే నిర్మాతలు వారందరి ఖర్చులు భరించవలసి వస్తుందన్నారు. ఈ విధంగా పూజా నిర్మాతలపై అధిక భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అసహనం ప్రశ్నించాడు. దాంతో పూజా ఇలా చేయడం ఏంటని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.