Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలు, పెగాసస్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ తన వైఖరిని చెప్పాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పెగాస్సపై న్యాయస్థానాలు స్పందిస్తున్నా ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రధాని మోడీతో పాటు తెలుగు ముఖ్యమంత్రుల గ్రాఫ్ క్రమంగా పడిపోయి దేశంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయన్నారు. బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టి రాజకీయ ఉద్యమానికి కమ్యూనిస్టులు సన్నాహాలు చేస్తున్నారని ఆయన తెలిపారు.