Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులలో ప్రవేశాలకుగాను నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. గతంలో ఎంసెట్ ఇపుడు ఈఏపీసెట్ గా మారిన సంగతి తెలిసిందే. ఇంజనీరింగ్ విభాగానికి రేపటి నుంచి కంప్యూటర్ ఆధారితంగా ఆన్ లైన్ లో పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆంగ్ల, తెలుగు మాధ్యమంలో 160 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన ఆన్ లైన్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. ఏపీ ఈఎసీ సెట్ కు 2.60 లక్షల మంది విద్యార్ధుల దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో 1,75,796 మంది విద్యార్థులు.. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకి 83,051 మంది విద్యార్ధులు దరఖాస్తు చేసుకున్నారు. 717 మంది రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఈనెల 19, 20, 23, 24, 25 తేదీలలో పరీక్షలు జరుగుతాయి. అగ్రికల్చర్, ఫార్మసీ విద్యార్థులకు సెప్టెంబర్ లో 3, 6, 7 తేదీలలో పరీక్షలు నిర్వహిస్తారు.