Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు నూతనంగా ఏడుగురు న్యాయమూర్తుల పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. రాష్ట్ర హైకోర్టు జడ్జిల సంఖ్యను పెంచిన కీలక ఉత్తర్వులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ సంతకం చేశారు. దాంతో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తుల పేర్లను ప్రతిపాదించగా... సుప్రీంకోర్టు కొలీజియం పేర్లను కేంద్రానికి సిఫారసు చేసింది. కొలీజియం సిఫార్సు చేసిన వారిలో శ్రీ సుధ, సుమలత, రాధా రాణి, లక్ష్మణ్, ఎన్. తుకారాం, వెంకటేశ్వర రెడ్డి , మాధవి దేవి ఉన్నారు. వీరిని హైకోర్టు జడ్జిలుగా పదోన్నతిపై నియమించాలన్న ప్రతిపాదనలకు సుప్రీం కొలీజియం ఆమోదం తెలిపింది.
ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం తదుపరి చీఫ్ జస్టిస్ రేసులో ఉన్న 9 మంది న్యాయమూర్తుల పేర్లు సిఫార్సు చేసింది. ఈ జాబితాలో మొత్తం ముగ్గురు మహిళలు ఉన్నారు. వారు జస్టిస్ బీవీ నాగరత్న, వారు జస్టిస్ హిమా కోహ్లీ (తెలంగాణ హైకోర్టు సీజే), జస్టిస్ బేల త్రివేది. వీరితోపాటు సుప్రీంకోర్టు బార్ నుంచి తెలుగు న్యాయవాది పీఎస్ నరసింహ పేరు కూడా కొలీజయం జాబితాలో ఉంది. ఇంకా జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ విక్రమ్ నాథ్ , జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సీటీ రవికుమార్,జస్టిస్ ఎంఎం సుంద్రేశ్ జాబితాలో ఉన్నారు.