Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కర్నూలు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన మూడు ఇండ్లలో వరసగా మంటలు చెలరేగాయి. ఒక ఇంటి తర్వాత ఒక ఇంట్లో మండలు రావడంతో ఇంట్లోని వారు బయటకు పరిగెత్తారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని కోడుమూరులోని ఒకటో వార్డులో ఖాజావలి, అతని ఇద్దరు కొడుకులు మన్సూర్, ఖలీల్లు వరసగా మూడు ఇండ్లలో ఉంటున్నారు. ముందుగా ఒక ఇంట్లో మంటలు చెలరేగిన సమయంలో వాటిని ఆర్పివేశారు. అప్పుడే పక్కనే ఉన్న మరో ఇంట్లో మంటలు చెలరేగాయి. వాటిని ఆర్పివేయగా మూడో ఇంట్లోకూడా మంటలు చెలరేగాయి. దాంతో కుటుంబసభ్యులు భయపడి ఇంట్లోని వస్తువులను బయటపడేసి బయటకు వచ్చారు.