Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో అధికారులు క్రస్ట్ గేట్ల మూసివేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ఫ్లో 34,341 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 40,726 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 590.00 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను... ప్రస్తుతం నీటి నిలువ 309.9534 టీఎంసీలుగా నమోదు అయ్యింది.