Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వనపర్తి జిల్లాలోని వీపనగండ్ల మండలం సంపట్రావుపల్లిలో దారుణం చోటు చేసుకుంది. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబాన్ని మేకల చంద్రయ్య అనే వ్యక్తి కిడ్నాప్ చేసి తన ఇంట్లోనే నిర్బంధించాడు. ఆ కుటుంబంపై వారం పాటు దాష్టీకం ప్రదర్శించారు. భార్యాభర్తలను ఇంట్లో నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సరూర్ నగర్ చెందిన శ్రీకాంత్ కుటుంబాన్ని సంపట్రావుపల్లికి చెందిన మేకల చంద్రయ్య కిడ్నాప్ చేశాడు. డబ్బుల విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో పని ఉందని చెప్పి సొంత గ్రామానికి తీసుకొచ్చి శ్రీకాంత్ కుటుంబాన్ని చంద్రయ్య నిర్బంధించాడు. చివరకు గ్రామస్తులు, పోలీసుల చొరవతో ఆ కుటుంబానికి విముక్తి లభించింది. ప్రస్తుతం శ్రీకాంత్ కుటుంబం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై వీపనగండ్ల పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.