Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : పెట్రోల్ పై విధిస్తున్న సెస్ ను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తే దాని ధర భారీగా తగ్గుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం తెలిపారు. సెస్ రూపంలో కేంద్ర ప్రభుత్వం సొమ్ము వసూలు చేస్తోందని అన్నారు. సెస్ అనేది పన్ను కాదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. వివిధ సమయాల్లో వేసిన సెస్ లను తొలగించకుండా, కేంద్రం అలాగే కొనసాగిస్తోందని, అందుకే పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు. ఆయా సమయాల్లో వేసిన సెస్ లను తొలగిస్తే లీటర్ పెట్రోల్ రూ. 32కే అందుబాటులోకి వస్తుందని చెప్పారు.