Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కాన్పు కోసం వచ్చిన ఓ నిండు గర్భిణి మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. వడ్డేపల్లి మండలం తనగల గ్రామానికి చెందిన శృతి (21) డెలివరీ కోసం ఈనెల 17న గద్వాల ప్రభుత్వ దవాఖానలో అడ్మిట్ అయింది. గురువారం ఉదయం శృతికి హైబీపీ రావడంతో వైద్యులు పరీక్షించగా మృతి చెందింనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శృతి మరణించిందని భర్త స్టీపెన్ అరోపించారు. నిన్న రాత్రి పురిటి నొప్పులు రాగ డాక్టర్లు అందుబాటులో లేకపోవడం కారణంగానే నా భార్య చనిపోయినట్లు ఆయన ఆరోపించారు. విషయం తెలుసుకున్న గద్వాల సీఐ షేక్ మహబుబ్ బాషా గద్వాల దవాఖానకు చేరుకుని విచారణ చేపట్టారు.