Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన మహిళపై కదులుతున్న కారులో ఇద్దరు వ్యక్తులు లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు వివరాల ప్రకారం.. నిందితులు మహిళపై లైంగికదాడికి పాల్పడి బాధిత మహిళను ఢిల్లీలోని శాస్త్రి పార్క్ ప్రాంతంలో వదిలి వెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి గురువారం నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కారు వెనక సీటులో కూర్చున్న వ్యక్తి మొదట ఆమెపై దాడి చేసి, ఆపై లైంగికదాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా ఈ ఘటన ఎవరికైనా చెబితే చంపేస్తానని కూడా నిందితులు బెదిరించినట్లు పేర్కొన్నారు. కాగా పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌లో కారును గుర్తించినట్లు వెల్లడించారు. దాని సహాయంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కాగా ఆగస్టు 16న జరిగిన ఈ ఘటన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.