Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీకి రష్యాలో మరోసారి చేదు అనుభవం ఎదురైంది. నిషేధిత కంటెంట్‌ను తొలగించడంలో విఫలమైన కారణంగా గూగుల్‌కు టాగన్స్కై జిల్లా కోర్టు జరిమానా విధించింది. గడిచిన కొన్ని నెలల్లో విదేశీ టెక్ కంపెనీలను రష్యా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. పోర్నోగ్నఫిక్ కంటెంట్, తీవ్రవాద పోస్టులు, డ్రగ్స్ లేదా ఆత్మహత్యలను ప్రోత్సహించే విధంగా ఉన్న పోస్టులపై రష్యాలో నిషేధం విధించారు. ఇటువంటి కంటెంట్‌ను తొలగించడంలో విఫలమవడంతో విదేశీ టెక్ దిగ్గజాలపై రష్యా చట్టపరమైన చర్యలు తీసుకుంటోంది. గురువారం నాడు టాగన్స్కై కోర్టు ఇదే విషయంలో గూగుల్‌పై మూడు జరిమానాలు విధించింది. దీంతో ఈ టెక్ కంపెనీ 6 మిలియన్ రూబల్స్ అంటే భారతీయ కరన్సీలో సుమారు రూ.60 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని టెలిగ్రాంలోని మాస్కో కోర్ట్స్ అధికారిక ఛానెల్లో వెల్లడించారు.
ఈ వారం ప్రారంభంలో కూడా ఈ అమెరికన్ టెక్ కంపెనీపై ఐదు జరిమానాలు పడ్డాయి. ఈ క్రమంలో 14 మిలియన్ రూబల్స్ అంటే రూ.1.4 కోట్ల రూపాయల జరిమానా కట్టాల్సి వచ్చింది. గత నెలలో డేటా స్టోరేజ్ చట్టాలను ఉల్లంఘించినందుకు సుమారు రూ. 40 లక్షల ఫైన్ కట్టింది. రష్యాలోని ఆర్ఐఏ నోవోస్టి న్యూస్ ఏజెన్సీ లెక్కల ప్రకారం, గూగుల్ ఇప్పటి వరకూ జరిమానాల రూపంలో రష్యాకు 32.5 రూబల్స్ (సుమారు రూ.3.2 కోట్లు) చెల్లించింది. ఇలా గూగుల్ మాత్రమే కాదు. రష్యాను విమర్శించిన అలెక్సీ నవలనీకి మద్దతుగా మైనర్లు కూడా నిరసనలు చేయాలంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. వీటిని తొలగించని కారణంగా సోషల్ మీడియా వేదికలపై రష్యా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌కు కూడా ఇటీవలే రష్యాలో ఫైన్ పడింది. అదే విధంగా ట్విటర్ సర్వీస్ స్పీడ్‌ను ప్రభుత్వం తగ్గించింది.