Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాధ్ సింగ్ సమర్ధించారు. ఈ చట్టాల్లో తమ ప్రయోజనాలకు భంగకరంగా ఉన్నాయని రైతులు భావించిన క్లాజులపపై ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉందని అన్నారు. సాగు చట్టాలను లోతుగా అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. సాగు చట్టాల చుట్టూ ప్రతికూల వాతావరణాన్ని కొందరు సృష్టించిన విషయం రైతులు గుర్తెరగాలని అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పలు చర్యలు చేపడుతోందని అన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమావేశంలో రాజ్నాధ్ సింగ్ మాట్లాడుతూ రైతుల అభ్యున్నతి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. కాగా వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన రైతులు గత ఏడాది నవంబర్ నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.