Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, పునర్నిర్మాణం, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. గురువారం ప్రగతి భవన్ లో వేములవాడ ఆలయ,పట్టణాభివృద్ధి పనులపై మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి, వీటీడీఏ, దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల పురోగతి, ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి పనులపై మంత్రులు ఆరా తీశారు.ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ దేశం అబ్బురపడే విధంగా సీఎం కేసీఆర్ యాదాద్రి ఆలయాన్ని పునఃనిర్మిస్తున్నారని, వేములవాడ ఆలయాన్ని ఆదే రీతిలో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి, పనులు ప్రారంభించుకున్నామన్నారు.