Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 88,308 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 409 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,54,035కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,852కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 453 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,43,318కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,865 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.