Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాంచీ: హార్డ్‌కోర్ నక్సలైట్ రమేశ్ గంజును జార్ఖండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడి తలపై రూ.15 లక్షల రివార్డు ఉన్నది. 30 మందికి పైగా పోలీసులను హత్య చేసిన కేసులో రమేశ్ గంజు ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఛత్ర పోలీసులు, పారామిలిటరీ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో నక్సలైట్ రమేశ్ గంజును అరెస్టు చేశారు. బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఇతడిపై 45 కి పైగా కేసులు నమోదయ్యాయని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. మందుపాతరలను అమర్చడంలో రమేష్ నిపుణుడని పోలీసులు చెప్పారు. 30 మందికి పైగా పోలీసులను చంపడంలో నక్సలైట్ రమేశ్ గంజు ప్రమేయం ఉందని జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో తలపై నగదు రివార్డులు ఉన్న ముగ్గురు నక్సలైట్లు లొంగిపోతున్నట్లు ప్రకటించిన రోజునే ఈ పరిణామం జరిగింది.