Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: జమ్మూకశ్మీరులోని అవంతిపొరా జిల్లా పాంపొరీ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. అవంతిపొరాలోని పాంపొరీ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర జమ్మూకశ్మీర్ పోలీసులు భద్రతా దళాలతో కలిసి శుక్రవారం తెల్లవారుజామున గాలింపు చేపట్టారు. పోలీసులు, జవాన్లు కలిసి గాలిస్తుండగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో పోలీసులు, జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయని కశ్మీర్ జోన్ పోలీసులు శుక్రవారం ఉదయం ట్వీట్ చేశారు. ఆగస్టు 13వతేదీన స్వాతంత్ర్యదినోత్సవానికి రెండు రోజుల ముందు కుల్గాం ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటరులో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది హతం అయ్యారు. జమ్మూకశ్మీరులో ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో పోలీసుల గాలింపు పెరిగింది. దీంతో తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.