Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో శుక్రవారం విపక్ష పార్టీల నేతలు సమావేశం కానున్నారు. సమావేశంలో 15 పార్టీలు పాల్గొననుండగా.. ఇవాళ సాయంత్రం వర్చువల్ విధానంలో భేటీ జరుగనుంది. బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్, ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఎన్సీపీ చీఫ్ శరద పవార్ సహా ఆయా పార్టీల నేతలు పాల్గొనున్నారు. సమావేశానికి ఆమ్ ఆద్మీ, బహుజన సమాజ్ పార్టీలను ఆహ్వానం అందలేదు. బెంగాల్ సీఎం మమత ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ పర్యటన చేపట్టారు.