Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వారంతా ఓ రిలీజియస్ ఫంక్షన్కు హాజరయ్యారు. అక్కడిచ్చిన ప్రసాదం తిన్నారు. మరుసటి రోజు వారికి వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా రెండు వందల మంది. అంతా దవాఖానలో చేరి చికిత్స తీసుకుంటున్నారు. ఈ ఘటన అసోంలోని హొజాయ్ జిల్లాలో చోటుచేసుకుంది. హొజాయ్ గత మంగళవారం సాయంత్రం ఓ మతానికి సంబంధించిన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి రెండు వందల మందికిపైగా మంది హాజరయ్యారు. అక్కడ ఇచ్చిన ప్రసాదం తిన్నారు. బుధవారం నుంచి వారికి వాంతులు, విరేచనాలు కాసాగాయి. దీంతో వారంతా హొజాయ్, నౌగావ్ లోని దవాఖానల్లో చేరారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. దీనికి ఫుడ్పాయిజన్ కారణమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అందరు క్షేమంగా ఉన్నారని చెప్పారు.