Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కతా: పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో భారీగా బంగారం పట్టుబడింది. సింథిమూర్ సిటీలో దాదాపు 3 కోట్లు విలువ చేసే బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. బంగ్లాదేశ్ నుండి రోడ్డు మార్గం ద్వారా కోల్కతాకు బంగారం తరలిస్తున్నారనే సమాచారం మేరకు సింథిమూర్ సిటీలో కస్టమ్స్ అధికారులు మాటు వేశారు. ఓ వాహనాన్ని అడ్డగించి తనిఖీలు చేయగా అక్రమ బంగారం పట్టుబడ్డింది. బంగారాన్ని సీజ్ చేసిన అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. పట్టుబడ్డ వారిలో కోల్కతాకు చెందిన ఓ రాజకీయ నాయకుడి భార్య ఉన్నట్లు సమాచారం.