Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై నిన్న దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు రైతులు తీవ్రంగా గాయపడ్డారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ-హర్యానా సరిహద్దులోని పల్వాల్ ప్రాంతంలో రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రైతులు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో నిన్న ఉదయం ఏడు గంటల సమయంలో 15 మంది దుండగులు శిబిరంపై దాడిచేసి ధ్వంసం చేశారు. కర్రలతో రైతులపై దాడిచేశారు. పిడిగుద్దులతో వారిపై విరుచుకుపడ్డారు. విషయం తెలిసిన వెంటనే రైతులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. వారి దాడిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురు రైతులను ఆసుపత్రికి తరలించారు. దాడి ఆర్ఎస్ఎస్, బీజేపీ గూండాల పనేనని రైతు సంఘం ఏఐకేఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు బాదల్ సరోజ్ ఆరోపించారు. శిబిరంపై దాడి జరగడం ఇది రెండోసారని పేర్కొన్నారు.