Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: అసోం రైఫిల్స్‌కు చెందిన లంగ్‌లై బెటాలియన్ మిజోరాంలో భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుంది. లాంగ్ట్లాయ్లోని ఇండో-మయన్మార్ సరిహద్దుకు సమీపంలో ఆయుధాలు, మందుడుగు సామగ్రిని పట్టుకుంది. మూడు పిస్టల్స్, 174 రౌండ్లు, మూడు కిలోల పేలుడు పదార్థాలు, తొమ్మిది డిటోనేటర్లు, మొబైల్ ఫోన్ ఐఈడీలను స్వాధీనం చేసుకున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. పేలుడు పదార్థాలకు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు తరలించారనే విషయంపై విచారణ దర్యాప్తు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.