Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాబుల్: ప్రపంచ దేశాలతో మంచి దౌత్య సంబంధాలు, వాణిజ్య బంధాలు కోరుకుంటున్నామని పైకి చెబుతోన్న తాలిబన్లు వాస్తవంలో మాత్రం తమ సహజసిద్ధ అరాచక వైఖరినే కొనసాగిస్తున్నారు. తాలిబన్ల ఆక్రమణల తర్వాత భారత్ సహా చాలా దేశాలు తమ దౌత్య కార్యాలయాలను ఖాళీ చేసి సిబ్బందిని స్వదేశాలకు తీసుకెళ్లాయి. అయితే, ఖాళీగా ఉన్న ఆ ఆఫీసుల్లోకి తాలిబన్లు చొరబడి కీలక దౌత్య పత్రాల కోసం తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. అఫ్గాన్‌లోని కాందహార్, హెరాత్ నగరాల్లో ఉన్న భారత దౌత్య కార్యాలయాల్లో గత బుధవారం తాలిబన్లు తనిఖీలు నిర్వహించినట్లు తెలిసిందని భారత ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. కీలక పత్రాలు ఏమైనా దొరుకుతాయేమోనని వారు ఇలా ప్రయత్నించినట్లు సమాచారం. అక్కడ ఎలాంటి పత్రాలు లభించకపోవడంతో ఆ కాన్సులేట్ల వద్ద ఉన్న వాహనాలను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు జలాలాబాద్, కాబుల్‌లో ఉన్న కాన్సులేట్,ఎంబసీల్లో తాలిబన్లు సోదాలు చేశారా లేదా అన్నది స్పష్టత లేదు.