Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజామాబాద్: జిల్లాలోని ఎడపల్లి పోలీసు కస్టడీ నుంచి నిందితుడు పరారయ్యాడు. గతంలో బాలికను వేధింపులకు గురిచేసిన కేసులో సిద్దాపూర్ గ్రామానికి చెందిన పీరాజీ కోర్టులో లొంగిపోయాడు. విచారణ నిమిత్తం నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా పోలీసులు నిద్రిస్తున్న సమయంలో నిందితుడు స్టేషన్ నుంచి పారిపోయాడు. వెంటనే పీరాజీని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.