Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హ్యూమనాయిడ్ రోబోలను త్వరలో మార్కెట్లోకి తీసుకురాబోతున్నట్టు ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారు టెస్లాసంచలన ప్రకటన చేసింది. గురువారం టెస్లా అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) డే జరిగింది. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్లో టెస్లా సీఈవో ఎలన్ మస్క్.. రోబో ఫీచర్స్‌ను ప్రారంభించారు. సుమారు 5.8 అడుగుల ఎత్తు, 125 పౌండ్ల బరువుతో రోబోను తయారు చేయనున్నారు. రోబో ముఖంలోనే పూర్తి సమాచారం కనిపించేలా డిస్ప్లే ఉంచారు. రోబోకు 45 నుంచి 150 పౌండ్ల బరువు మోసే సామర్థ్యం ఉంటుందని, గంటకు ఐదు మైళ్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ సీఈఓ తెలిపారు. టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కోసం ఉపయోగిస్తున్న ఏఐనే హ్యూమనాయిడ్ రోబోలకూ ఉపయోగించబోతున్నారు. అలాగే ఆటోపైలోట్ సాఫ్ట్వేర్(ఏఐ)ను ఉపయోగించబోతున్నారు.
ఇంకా సీఈఓ మాట్లాడుతూ చక్రాల మీదే కాదు.. రెండు కాళ్ల మీద కూడా టెస్లా ఏఐ అద్భుతంగా పని చేస్తుందన్నారు.ప్రస్తుతం ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ రోబోలు వచ్చే ఏడాదికల్లా మార్కెట్లోకి రానున్నాయి.