Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సెప్టెంబరు నాటికి పిల్లలకు కొవిడ్ టీకాలు వేస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. ఆయన మాట్లాడుతూ జైడస్ కాడిలా, భారత్ బయోటెక్ ల పిల్లల కోవిడ్ టీకాలు ప్రస్తుతం ట్రయల్ దశలో ఉన్నాయని తెలిపారు. 2 నుంచి 18 ఏండ్ల వయసు పిల్లలకు కోవాక్సిన్ ఫేజ్ 2,3 పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు. వీటి పరిశోధనా ఫలితాలు వచ్చే నెలలో విడుదల కానున్నాయన్నారు. అశాజనక ఫలితాలు రాగానే సెప్టెంబరు నాటికి పిల్లలకు కొవిడ్ వ్యాక్సిన్లు వేస్తామని మంత్రి చెప్పారు. చట్టబద్ధమైన అనుమతులకు లోబడి 12 ఏండ్ల వయసు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లల కోసం జైడస్ కాడిలా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇస్తామని అన్నారు.