Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అయతే అతనికి తల కొరివి పెట్టేందుకు అతని కొడుకు నిరాకరించాడు. దాంతె మృతుడి పదేండ్ల కూతురే దహన సంస్కారాలు నిర్వహించింది. గుండెలు తరుక్కుపోయే ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో చోటుచేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగిశెట్టి నీలాచలం సెలూన్ షాపు నడుపుతూ కుటుంబా న్ని పోషించేవాడు. లాక్ డౌన్ వల్ల షాపు తెరవకపోవడం, అనంతరం తెరిచినా ఎవరూ రాకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లక్షల రూపాయల వరకు అప్పయింది. మరోవైపు అతని 16 ఏండ్ల కొడుకు కూడా పోకిరిగా తిరగడంతో నీలాచలం మనస్తాపానికి గురయ్యాడు. పద్ధతి మార్చుకోవాలని కొడుకుకు చెప్పినా అతను తండ్రికే ఎదురుతిరిగాడు. రెండు రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులతో కౌన్సిలింగ్ కూడా ఇప్పించాడు. అయినా ఆ కొడుకు తీరు మారలేదు. చివరికి తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే తండ్రి మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించడానికి కూడా ఆ కొడుకు నిరాకరించాడు. దాంతో మృతుడి పదేండ్ల కుమార్తెతో నీలాచలానికి అంత్యక్రియలు జరిపించారు.
అంత్యక్రియలు చేస్తూ ఆ చిన్నారి చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. రేపటి నుంచి తనకు చాక్లెట్లు ఎవరు కొనిస్తారు అని క్లాసులు అర్థంకాకపోతే ఎవరు చెప్తారు అంటూ ఆ చిన్నారి కన్నీరు మున్నీరయింది.