Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: నకిలీ చలానాల కేసులో కడప సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను పోలీసులు అరెస్టు చేశారు. జింకా రామకృష్ణ, లక్ష్మీనారాయణ, గురుప్రకాశ్‌లను అదుపులోకి తీసుకున్నారు. నకిలీ చలానాలతో వీరు రూ.కోటి 3 లక్షలు స్వాహా చేసినట్లు గుర్తించారు. నిందితుల నుంచి రూ.67 లక్షలను రికవరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి ల్యాప్‌టాప్‌లు, ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ దాడులు చేస్తే తప్ప సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నకిలీ చలాన్ల విషయం వెలుగులోకి రాలేదని, అసలు ఈ వ్యవహారం ఎన్ని రోజుల నుంచి జరుగుతోందని అధికారులను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నిన్న ప్రశ్నించిన విషయం తెలిసిందే. ‘ఈ స్థాయిలో తప్పులు జరుగుతుంటే మన దృష్టికి ఎందుకు రావడం లేదు? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? క్షేత్ర స్థాయిలో వ్యవస్థలు సవ్యంగా నడుస్తున్నాయో? లేవో? ఎందుకు చూడటం లేదు? ప్రభుత్వ శాఖల్లోని అవినీతికి అడ్డుకట్ట వేయాలి. అవసరమైతే క్షేత్ర స్థాయి నుంచి నిఘా సమాచారం తెప్పించుకోండి’ అని సూచించారు.