Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో రాత్రి పూట కర్ఫ్యూని ప్రభుత్వం మరోసారి పొడిగించింది. కరోనా వ్యాప్తిని కట్టడిచేయడానికి విధించిన నైట్ కర్ఫ్యూని సెప్టెంబర్ 4 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో ఉంటుందని ప్రకటించింది. కోవిడ్ ప్రోటోకాల్స్ తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,501 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ ప్రభావంతో 10 మంది మృతి చెందారు. తాజాగా 1,697 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 19,69,169మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,738యాక్టివ్ కేసులు ఉన్నాయి.