Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వైఎస్ఆర్టీపీకి ఆ పార్టీ కీలకనేత ఇందిరాశోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి.. రాజీనామా లేఖను వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పంపారు.
రాజీనామాకు కారణాన్ని ఆమె లేఖలో ఈ విధంగా వివరించారు. 'రాజీనామాకు కారణం ఏంటంటే.. అమరవీరుల ఆశయాల సాధన కోసం, అన్నదాతల జీవితాల్లో ఆనందం కోసం, యువతకు, నిరుద్యోగులకు న్యాయం కోసం, దళిత, బహుజనుల, సబ్బండ వర్గాల సాధికారత కోసం, మైనార్టీల బతుకు బాగుకోసం, గిరిజనుల జీవితాల్లో వెలుగుల కోసం, మహిళలకు సమాన వాటా కోసం, కొట్లాడుతూనే ఉన్నాను. నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు కొట్లాడుతూనే ఉంటా. అందుకు షర్మిలక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో ఉండకూడదని.. అభిమానులు, శ్రేయోభిలాషులు, తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు నేను ఈ పార్టీకీ రాజీనామా చేశాను` అని వివరించారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానని ఆమె చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో తనకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాములు తెలిపారు.