Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు తెలంగాణ సీనియర్ కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు లేఖ రాశారు. హజీపూర్ లో ముగ్గురు అమ్మాయిలపై లైంగికదాడి చేసి, హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి అనే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో వీహెచ్ కోరారు. ఈ కేసు ఏడాదిన్నరగా హైకోర్టులో పెండింగ్ లో ఉందని చెప్పారు. హజీపూర్ హత్యల ఘటన అప్పట్లో రెండు రాష్ట్రాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. వీటి లింకులు కర్నూలు వరకు వెళ్లాయి. ఒంటరి అమ్మయిలు, మహిళలను టార్గెట్ చేసి, వారిని బైక్ పై ఎక్కించుకుని నిర్మానుశ్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి, లైంగికదాడి చేసి ఆ తర్వాత హత్య చేసిన కేసుల్లో శ్రీనివాస్ రెడ్డిని కింది కోర్టు దోషిగా తేల్చింది. అయితే, హైకోర్టులో ఈ కేసు ఏడాదిన్నరగా పెండింగ్ లో ఉంది. కేసు పెండింగ్ లో ఉన్న విషయాన్ని సీజేఐ దృష్టికి వీహెచ్ తీసుకెళ్లారు.