Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తర్ప్రదేశ్లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్కడి యువతకు సీఎం యోగి ఆదిత్యనాథ్ వరాల జల్లును కురిపిస్తున్నారు. డిజిటల్ సాధికారత పేరిట కోటిమంది యువతకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ ఇవ్వనున్నట్టు తెలిపారు. బుధవారం ఆయన అసెంబ్లీలో అనుబంధ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, టెక్నికల్, డిప్లొమా కోర్సులు చదివే విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ అందించనున్నామన్నారు. ఈ పథకం కింద కోటి మంది విద్యార్థుల్ని ఎంపిక చేస్తామని తెలిపారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు సన్నాహక భత్యం ఇచ్చి సహకరిస్తామని తెలిపారు. ఈ పథకం కోసం సుమారు రూ.3వేల కోట్లు వెచ్చించనున్నారు.