Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఎంతో మంది ఆత్మహత్యయత్నం చేస్తుండగా ప్రాణాలను పణంగా పెట్టి రక్షించిన ఇద్దరు హోంగార్డులు.. కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్కృష్ణ సేవా పురస్కారానికి రాష్ర్టం నుంచి ఎంపికయ్యారు. వారు హుస్సేన్‌సాగర్ నెక్లెస్రో్డ్డులోని లేక్ పోలీస్‌స్టేషన్‌లో హోగార్డులుగా విధులు నిర్వహిస్తున్న వెంకటసుబ్బారెడ్డి, కృష్ణయాదవ్ లు.
ఈ సందర్భంగా లేక్ ఇన్స్ పెక్టర్ ధనలక్ష్మీ మాట్లాడుతూ హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న చాలామందిని వీరు రక్షించారని తెలిపారు. వారిద్దరినీ ఆమెతో పాటు స్టేషన్ సిబ్బంది అభినందించారు.