Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీలో బీబీ-కా-ఆలం ఊరేగింపు మొదలైంది. మొహర్రం సంతాప దినంలో భాగంగా డబీర్‌పురాలోని బీబీ-కా-ఆలం నుంచి అంబారిపై బీబీ-కా-ఆలం ఊరేగింపు ప్రారంభమైంది. ఈ ఊరేగింపు అలీజ కోట్ల, చార్మినార్, గుల్జార్‌హౌజ్, పంజేశా, మీర్ఆలం మండి, దారుల్ శిఫ మీదుగా వెళ్లి చాదర్‌ఘాట్ వద్ద ముగియనుంది. భారీ సంఖ్యలో షియా ముస్లిం సోదరులు కత్తులు, బ్లేడ్లతో తమ శరీరాన్ని గాయపరుచుకుని రక్తాన్ని చిందిస్తూ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే చార్మినార్ వద్ద బీబీ-కా-ఆలం చూసేందుకు ప్రజలు భారీ సంఖ్యలో వచ్చారు.
ఊరేగింపులో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగర సీపీ అంజనీ కుమార్ చార్మినార్ వద్ద ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.