Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుంది. బుల్దానాలోని సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వస్తున్న టిప్పర్ అదుపు తప్పి బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టిప్పర్ పై కూర్చున్న కూలీలు రోడ్డుపై పడిపోయారు. టిప్పర్ ఐరన్ లోడుతో ప్రయాణిస్తుండగా, కూలీలు ఐరన్ లోడుపై కూర్చున్నారు. వారందరూ సమృద్ధి ఎక్స్ ప్రెస్ హైవే ప్రాజెక్టు పనుల్లో కూలీలుగా పనిచేస్తున్నారు.