Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో నక్సల్స్‌కు పోలీసులకు మధ్య శుక్రవారం మధ్యాహ్నం ఎదురుకాల్పులు జరిగాయి. చోటెడోంగర్ పోలీస్ స్టేషన్ పరిధి కాదేమెట ప్రాంతంలోని ఐటీబీపీ శిబిరానికి సమీపంలో ఈ కాల్పులు చోటు చేసుకోగా ఇద్దరు ఇండో టిబెటన్ బార్డర్ పోలీసులు (ఐటీబీపీ) మృతి చెందారు.
బస్తర్ రేంజ్ ఐజీ సుందరరాజ్ మాట్లాడుతూ 45వ బెటాలియన్‌కు చెందిన ఐటీబీపీ జవాన్లు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నక్సల్స్ తారసపడటంతో ఎదురు కాల్పులు జరిగినట్టు తెలిపారు. నక్సల్స్ కాల్పుల్లో ఐటీబీపీ అసిస్టెంట్ కమాండర్ సుధాకర్ షిండే, ఏఎస్ఐ గురుముఖ్ సింగ్ మృతి చెందినట్లు ఆయన పేర్కొన్నారు. ఘటనాస్థలం నుంచి ఓ ఏకే-47 రైఫిల్, రెండు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, ఓ వైర్లెస్ సెట్‌ను నక్సల్స్ అపహరించినట్టు చెప్పారు.