Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: యువ పారిశ్రామిక వేత్త రాహుల్ హత్య కేసులో పోలీసులు వేగం పెంచారు. నిందితుడు కొరడా విజయకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. విజయకుమార్ కుటుంబ సభ్యులు, అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రాహుల్ హత్యకు నిందితులు పక్కా స్కెచ్ వేసినట్లు పోలీసులు చెబుతున్నారు. రాహుల్ హత్య వెనుక కోరాడ విజయ్‌కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నా, మరో బడా పారిశ్రామికవేత్త హస్తం కూడా ఉన్నట్టు ఆధారాలు లభించాయి. రాహుల్‌కు, విజయ్‌కుమార్‌కు మధ్య లాక్డౌన్ నుంచి వివాదాలు నడుస్తున్నాయి. ఇదంతా రూ.కోట్లలో ఉన్నట్టు సమాచారం. ఇద్దరికీ వయస్సురీత్యా చాలా వ్యత్యాసం ఉంది. ఈ డబ్బు గొడవల నేపథ్యంలో కోరాడ ఈ హత్యకు కిరాయి హంతకులను నియమించాడా లేక రాహుల్ వద్ద ఉండే వారినే హంతకులుగా మార్చాడా అన్నది తెలియాల్సి ఉంది. హత్య జరిగిన సమయంలో కోరాడ అక్కడికి సమీపంలో ఉన్నట్టు సమాచారం.