Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : 100 మంది సెలబ్రిటీల నగ్నవీడియోలు రికార్డు చేసి బ్లాక్‌మెయిల్‌కు దిగిన సైబర్ నేరగాళ్ల ముఠాను ముంబై సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఏకంగా 285 మంది నగ్న వీడియోలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సైన్స్ గ్రాడ్యుయేట్స్ కాగా ఒకరు మైనర్. వీరి నుంచి పెద్ద ఎత్తున మొబైల్ ఫోన్లు, 12 నకిలీ ఖాతాలు, 6 నకిలీ ఈ మేయిల్ ఐడీలు, ఇతర ఎలక్ట్రరానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.చేసుకున్న స్వాధీనం చేసుకున్న వీడియోల్లో బాలీవుడ్‌కు చెందిన 100 మంది సినీ, టీవీ నటులు ఉండడం సంచలనంగా మారింది.
నిందితులు సోషల్ మీడియాలో సెలబ్రిటీలను పరిచయం చేసుకుని వీడియో కాల్స్ చేస్తారని తెలిసింది. తర్వాత నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడి వాటిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్‌కు దిగుతారని తెలుస్తోంది. అనంతరం ఆ వీడియోలను ఫోర్న్ సైట్లకు అమ్ముతారని సమాచారం. అపరిచితుల నుంచి వీడియో కాల్ లు , మెసేజ్ లు వస్తే స్పందించొద్దని పోలీసులు కోరుతున్నారు.